

మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కాకా’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ ఘన విజయం సాధించడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి మరింత పెరిగింది. ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు మంచి స్పందన రావడంతో పాటు, సినిమాను 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
అయితే ప్రస్తుతం ‘కాకా’ విడుదల తేదీపై సోషల్ మీడియాలో కొత్త ప్రచారం జరుగుతోంది. 2027 సంక్రాంతి బరిలో ఇప్పటికే పలువురు స్టార్ హీరోల చిత్రాలు ఉండటంతో థియేటర్ల లభ్యత, బాక్సాఫీస్ పోటీ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని సినిమాను సమ్మర్‌కు వాయిదా వేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. వేసవి సెలవుల సమయంలో సోలో రిలీజ్‌తో భారీ వసూళ్లు సాధించవచ్చని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వాయిదాపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!