

మహిళల టీ20 ఆసియా కప్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో హాంకాంగ్‌పై 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హాంకాంగ్ జట్టు భారత బౌలర్ల ధాటికి 16.2 ఓవర్లలో కేవలం 56 పరుగులకే ఆలౌటైంది. నటాషా మైల్స్ 15, మరీనా లంప్‌లాఫ్ 14 పరుగులతో మాత్రమే కొంత పోరాడగా, మిగతా బ్యాటర్లు రెండంకెల స్కోరు చేయలేకపోయారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ మూడు వికెట్లతో మెరిసింది. ప్రేమ రావత్, నందనీ శర్మ, శ్రీచరణి తలో రెండు వికెట్లు తీసి హాంకాంగ్ బ్యాటింగ్‌ను కుప్పకూల్చారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అద్భుతమైన 124 పరుగులతో శతకం సాధించి జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించింది. షెఫాలీ వర్మ 28 పరుగులతో సహకరించగా, ప్రతీక రావల్ 10, రిచా ఘోష్ 11, హర్మన్‌ప్రీత్ కౌర్ 10 పరుగులు చేశారు. హాంకాంగ్ బౌలర్లలో మరీనా రెండు వికెట్లు తీసుకోగా, రుచితా వెంకటేశ్, జాయ్‌లీన్ కౌర్ తలో వికెట్ సాధించారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమష్టిగా రాణించిన భారత్ భారీ విజయంతో టోర్నీలో తన ఆధిపత్యాన్ని చాటింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!