
సినిమాలు

హైదరాబాద్‌లో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు క్రీడా రంగానికి ప్రత్యేకంగా నిలిచింది. ‘ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్’ సెషన్లో మంత్రి అజారుద్దీన్‌తో పాటు క్రీడా దిగ్గజాలు అనిల్ కుంబ్లే, పుల్లెల గోపీచంద్, పీవీ సింధు, అంబటి రాయుడు, గుత్తా జ్వాల పాల్గొన్నారు. భారత క్రీడలకు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించే మార్గం, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే సత్తా వంటి అంశాలపై చర్చ సాగింది.
ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ క్రీడాకారుల విజయానికి అనేక అంశాలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. మౌలిక వసతులు, నాణ్యమైన కోచ్‌లు ఎంతో కీలకమని చెప్పారు. ప్రతి దశలోనూ క్రీడాకారులకు ప్రోత్సాహం, మద్దతు దక్కితేనే వారు ప్రపంచస్థాయి వేదికలపై మెరుగైన ప్రదర్శన ఇవ్వగలరని సింధు అన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!