
భారత్–పాకిస్థాన్ క్రికెట్ సంబంధాల విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) భారత్‌తో మ్యాచ్‌లు ఆడేందుకు పెట్టిన అన్ని డిమాండ్లను బీసీసీఐ తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 నేపథ్యంలో పీసీబీ కొన్ని షరతులు విధించినప్పటికీ, వాటిని అంగీకరించేది లేదని బీసీసీఐ స్పష్టంగా ICCకి తెలియజేసినట్లు సమాచారం.
తాజా పరిణామాల ప్రకారం, పాకిస్థాన్‌తో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడే ఆలోచన భారత్‌కు లేదని బీసీసీఐ తేల్చి చెప్పింది. రాజకీయ, భద్రతా పరిస్థితుల కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయిన ద్వైపాక్షిక క్రికెట్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. అలాగే ఆసియా కప్ లేదా వరల్డ్‌కప్ మ్యాచ్‌ల కోసం భారత్ పాకిస్థాన్‌కు వెళ్లబోదని, భవిష్యత్ అంతర్జాతీయ టోర్నమెంట్లు జరిగితే అవి న్యూట్రల్ వేదికలకే పరిమితం అవుతాయని పేర్కొంది.
ఇదే సమయంలో బంగ్లాదేశ్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ల అంశంపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బంగ్లాదేశ్‌తో కూడా సిరీస్‌లకు ప్రణాళిక లేదని సమాచారం. అయితే భారత్–పాకిస్థాన్ మ్యాచ్‌లలో హ్యాండ్‌షేక్ అంశంపై మాత్రం చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నిర్ణయాలు రెండు దేశాల క్రికెట్ సంబంధాల్లో మరో కీలక మలుపుగా మారే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!