

ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై బీసీసీఐ మరోసారి సమీక్షకు సిద్ధమవుతోంది. ఐపీఎల్-2027 సీజన్‌కు ముందు ఈ నిబంధనపై పది ఫ్రాంచైజీల నుంచి అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆగస్టు 31లోగా తమ సూచనలు, అభిప్రాయాలను సమర్పించాలని జట్లను కోరినట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2026 అనంతరం ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను సమీక్షిస్తామని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా గతంలో ప్రకటించారు.
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌తో పాటు ప్లేయర్లు, మ్యాచ్ అధికారుల ప్రాంతం (పీఎంఓఏ), అంపైరింగ్, ప్రాక్టీస్ సెషన్లు, ప్లేయింగ్ కండిషన్స్ వంటి అంశాలపైనా ఫ్రాంచైజీల నుంచి సూచనలు కోరినట్లు సమాచారం. కొన్ని జట్ల కెప్టెన్లు ఈ నిబంధనపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో బీసీసీఐ తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. పది జట్ల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను పరిశీలించిన అనంతరం రూల్‌ను కొనసాగించాలా, మార్పులు చేయాలా అనే దానిపై తుది నిర్ణయం తీసుకోనుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!