

కోలీవుడ్ స్టార్ హీరో శింబు ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అరసన్ చిత్రంలో శింబు నటిస్తున్నారు. ప్రియాంక మోహన్, ఆండ్రియా జెర్మియా, సముద్రఖని, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామాను ఈ ఏడాది దీపావళి సందర్భంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా పూర్తికాకముందే శింబు తన తదుపరి చిత్రాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు.
ఓ మై కడవులే, డ్రాగన్ చిత్రాల దర్శకుడు అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో STR-51 వర్కింగ్ టైటిల్‌తో శింబు తదుపరి సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాలీవుడ్ యంగ్ బ్యూటీ, మాజీ మిస్ యూనివర్స్ ఇండియా మానస వారణాసి ఈ సినిమాలో శింబు సరసన హీరోయిన్‌గా నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే రియా శింబు కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాలపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!