

హెచ్‌సీఏ ‘సి’ డివిజన్ వన్డే లీగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తన బ్యాటింగ్ ప్రతిభతో ఆకట్టుకున్నారు. ఆదివారం సికింద్రాబాద్ క్లబ్లో జరిగిన మ్యాచ్‌లో సికింద్రాబాద్ క్లబ్ తరఫున బరిలోకి దిగిన ఆనంద్ అజేయ శతకంతో చెలరేగారు. కేవలం 82 బంతుల్లోనే 21 ఫోర్లు, 5 సిక్సర్లతో 126 పరుగులు సాధించారు. ఆయనతో పాటు జంషీద్ 77, సంజీవ్ రెడ్డి 40 పరుగులతో రాణించడంతో సికింద్రాబాద్ క్లబ్ 39 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 328 పరుగుల భారీ స్కోరు చేసింది.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు 21.1 ఓవర్లలో 3 వికెట్లకు 72 పరుగులు చేసిన సమయంలో వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. దీంతో వీజేడీ పద్ధతిలో సికింద్రాబాద్ క్లబ్‌ను విజేతగా ప్రకటించారు. బ్యాటింగ్‌లో అదరగొట్టిన ఆనంద్ బౌలింగ్‌లోనూ ఆకట్టుకున్నారు. 5 ఓవర్లు వేసి కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చారు. తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ సీజన్లో ఆనంద్ ఆడిన తొలి లీగ్ మ్యాచ్ ఇదే కావడం విశేషం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!