

స్వదేశంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల చేతిలో టీమిండియా క్లీన్ స్వీప్ కావడంతో, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అతడిని కోచ్ పదవి నుంచి తొలగించవచ్చన్న వార్తలు, లేదా టెస్టుల నుంచి తప్పించి పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితం చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. అంతేకాకుండా బీసీసీఐ కొత్త టెస్ట్ కోచ్ కోసం దిగ్గజ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌తో చర్చలు జరిపిందన్న కథనాలు కూడా చక్కర్లు కొట్టాయి.
ఈ వార్తలన్నింటినీ బీసీసీఐ తీవ్రంగా ఖండించింది. గౌతమ్ గంభీర్ కోచ్‌గా కొనసాగుతారని, అతడితో ఉన్న కాంట్రాక్ట్ 2027 వన్డే ప్రపంచకప్ వరకూ అమల్లో ఉందని బీసీసీఐ ప్రధాన కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. కోచింగ్ వ్యవస్థలో ఎలాంటి మార్పులపై ఇప్పటివరకు ఎలాంటి చర్చలు జరగలేదని, బోర్డు గంభీర్‌పై పూర్తి నమ్మకంతో ఉందని తెలిపారు. ఇలాంటి ఊహాజనిత వార్తలను ప్రచారం చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!