
రాజకీయాలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ జట్టును వీడినట్లు సమాచారం. దీంతో ఆయన స్థానంలో కొత్త కోచ్‌గా ఎవరిని నియమిస్తారనే అంశంపై క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం ఈ పదవికి మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, భారత మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు మాజీ క్రికెటర్ హేమంగ్ బదానీ, మాజీ భారత వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కొత్త కోచ్ నియామకంపై సీఎస్‌కే యాజమాన్యం ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!