
క్రీడలు

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఈ నెల 30 నుంచి వచ్చే నెల 4 వరకు పాకిస్థాన్‌లో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. అయితే అదే సమయంలో ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఉండటంతో పలువురు కీలక ఆటగాళ్లు అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో పాటు హాజెల్‌వుడ్, మిచెల్ స్టార్క్ వంటి స్టార్ బౌలర్లు తమ ఐపీఎల్ జట్లతో భారత్‌లోనే ఉండే అవకాశం ఉంది.
లీగ్ మ్యాచ్‌లు ఈ నెల 24 తో ముగియనుండగా, 31 న ఫైనల్ జరగనుంది. రైజర్స్, ఆర్సీబీ, ఢిల్లీ జట్లు ప్లేఆఫ్స్ రేసులో ఉన్నాయి. పాకిస్థాన్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు 23 న చేరనుండటంతో, తొలి మ్యాచ్‌కు కూడా కొందరు ఆటగాళ్లు దూరమయ్యే అవకాశముంది. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించని జట్ల ఆటగాళ్లు మాత్రమే పాక్ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!