

ఆస్ట్రేలియా గడ్డపై టీ20 సిరీస్‌ను గెలిచిన భారత మహిళా జట్టుకు వన్డే సిరీస్‌లో మాత్రం నిరాశ ఎదురైంది. వరుసగా రెండో వన్డేలోనూ ఓడిన భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను కోల్పోయింది. హోబర్ట్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 251 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యాన్ని ఛేదించిన ఆస్ట్రేలియా 36.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసి ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. జార్జియా వోల్ 82 బంతుల్లో 101 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా, ఫోయిబ్ లిట్చ్‌ఫీల్డ్ 62 బంతుల్లో 80 పరుగులతో దూకుడుగా ఆడింది. బెత్ మూనీ (31), అన్నాబెల్ సదర్లాండ్ (10), ఆష్లే గార్డెనర్ (15*) సహకారం అందించారు. భారత బౌలర్లలో కాష్వీ గౌతమ్, దీప్తి శర్మ తలో రెండు వికెట్లు, క్రాంతి గౌడ్ ఒక వికెట్ తీశారు. జార్జియా వోల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్ ప్రతీకా రావల్ (52), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (54) అర్ధ సెంచరీలతో నిలబడ్డారు. స్మృతి మంధాన (31), రిచా ఘోష్ (22), కాష్వీ గౌతమ్ (25), క్రాంతి గౌడ్ (19) ఫర్వాలేదనిపించగా, జెమీమా రోడ్రిగ్స్ (15), దీప్తి శర్మ (1), అమన్‌జోత్ కౌర్ (13) ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఆసీస్ బౌలర్లలో ఆష్లే గార్డెనర్, అన్నాబెల్ సదర్లాండ్, అలానా కింగ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా, స్కట్ మరియు నికోలా కారీ చెరో వికెట్ తీశారు. ఇప్పటికే తొలి వన్డే గెలిచిన ఆస్ట్రేలియా సిరీస్‌ను కైవసం చేసుకోగా, మూడో వన్డే మార్చి 1న హోబర్ట్‌లో జరగనుంది.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!