

ఆసియా క్రీడల్లో భారత్‌కు పతకం ఖాయమని భావించిన స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతిసురేఖకు ఊహించని నిరాశ ఎదురైంది. గత ఆసియా క్రీడల్లో మహిళల కాంపౌండ్ విభాగంలో స్వర్ణం సాధించిన జ్యోతి.. ఈసారి కనీసం క్వార్టర్‌ఫైనల్‌కు కూడా చేరకుండానే నిష్క్రమించింది. ప్రిక్వార్టర్‌ఫైనల్లో 14 ఏళ్ల దక్షిణ కొరియా ఆర్చర్ కాంగ్ యెన్సియో చేతిలో ఓటమి పాలైంది. జ్యోతి 146 పాయింట్లు సాధించినప్పటికీ.. కాంగ్ 150కి 150 పాయింట్లతో అద్భుత ప్రదర్శన చేసి భారత స్టార్‌కు షాకిచ్చింది. మరోవైపు తొలిసారి ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న తెలంగాణకు చెందిన చికిత తానిపర్తి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గణేశ్ మణిరత్నం కాంపౌండ్ ఆర్చరీ వ్యక్తిగత విభాగాల్లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నారు. చికిత ప్రిక్వార్టర్స్‌లో చైనీస్ తైపీకి చెందిన చెన్ సుయాన్‌తో 148-148తో సమంగా నిలిచి షూటాఫ్‌లో విజయం సాధించింది. గణేశ్ 149-137తో చెన్ చీ లున్‌ను ఓడించాడు.
స్క్వాష్‌లోనూ భారత జట్లు సత్తా చాటాయి. పురుషులు, మహిళల జట్లు క్వార్టర్‌ఫైనల్‌లోకి ప్రవేశించాయి. మహిళల జట్టు ప్రిక్వార్టర్స్‌లో జపాన్‌ను 2-1తో ఓడించింది. సీనియర్ క్రీడాకారిణి జోష్న చిన్నప్ప, తన్వి ఖన్నా తమ మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. యువ క్రీడాకారిణి అనాహత్ సింగ్ ఓటమి పాలైంది. పురుషుల విభాగంలో భారత్ దక్షిణ కొరియాపై 3-0తో ఘన విజయం సాధించింది. వేలవన్ సెంథిల్ కుమార్, అభయ్ సింగ్, వీర్ చోత్రాని తమ తమ మ్యాచ్‌ల్లో ప్రత్యర్థులను ఓడించి భారత్‌ను క్వార్టర్‌ఫైనల్‌కు చేర్చారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!