
షోస్

ఆసియా క్రీడలు–2026లో భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఈషా సింగ్ రజత పతకం సాధించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఈషా 38 హిట్స్‌తో చైనా షూటర్ షియావో జియారుయిక్సువాన్‌తో సమంగా నిలిచారు. అనంతరం జరిగిన షూట్‌ఆఫ్‌లో స్వర్ణం చేజారడంతో రజతంతో సరిపెట్టుకున్నారు.
మరోవైపు మహిళల -78 కిలోల కురాష్ విభాగంలో పింకీ బల్హారా కాంస్య పతకాన్ని దక్కించుకున్నారు. సెమీఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన మో సుమిన్ చేతిలో 0-5 తేడాతో ఓడటంతో ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. అంతకుముందు క్వార్టర్‌ఫైనల్లో దక్షిణ కొరియా అథ్లెట్ గరమ్ లిమ్‌పై 3-0తో విజయం సాధించి సెమీస్‌కు చేరుకున్నారు. 2018 ఆసియా క్రీడల్లో రజతం సాధించిన పింకీకి ఇది రెండో ఆసియా క్రీడల పతకం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!