

టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ టీ20 ప్రపంచకప్‌లో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. నమీబియాతో జరగనున్న మ్యాచ్‌లో మరో నాలుగు వికెట్లు సాధిస్తే, టీ20 ప్రపంచకప్ మ్యాచుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు రవిచంద్రన్ అశ్విన్ పేరిట ఉంది. అశ్విన్ 24 మ్యాచుల్లో 32 వికెట్లు సాధించగా, అర్ష్‌దీప్ కేవలం 15 మ్యాచుల్లోనే 29 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
జస్ప్రీత్ బుమ్రా 26 వికెట్లు, హార్దిక్ పాండ్య 24 వికెట్లు, రవీంద్ర జడేజా 22 వికెట్లతో తదుపరి స్థానాల్లో ఉన్నారు. 2022లో ఇంగ్లాండ్‌పై అరంగేట్రం చేసిన అర్ష్‌దీప్, మెల్బోర్న్లో పాకిస్థాన్‌పై తన తొలి ప్రపంచకప్ మ్యాచ్ ఆడాడు. 2024 ఎడిషన్‌లో రోహిత్ శర్మ సారథ్యంలో ఎనిమిది మ్యాచుల్లో 17 వికెట్లు సాధించి ఒకే ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. మొత్తంగా టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు బంగ్లాదేశ్ మాజీ ఆటగాడు షకీబ్ అల్ హసన్ పేరిట ఉంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!