
న్యూస్

2030లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌కు వేదిక అధికారికంగా ఖరారైంది. మన దేశంలోని గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఈ గేమ్స్‌ను ఆతిథ్యం ఇవ్వనుంది. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ స్పోర్ట్స్ జనరల్ అసెంబ్లీలో 74 దేశాల ప్రతినిధులు భారత బిడ్‌కు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా సంబంధిత పత్రాలను భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటి ఉష స్వీకరించారు.
అలాగే, ఇండియాలో జరగబోయే ఈ మెగా ఈవెంట్లో 15 నుంచి 17 క్రీడా విభాగాలు ఉండనున్నాయి. అయితే వచ్చే ఏడాది గ్లాస్గోలో జరుగనున్న కామన్వెల్త్ గేమ్స్‌లో మాత్రం 10 క్రీడాంశాలు మాత్రమే ఉండనున్నాయి. ప్రత్యేకత ఏమిటంటే—2030 కామన్వెల్త్ గేమ్స్ శతాబ్ది క్రీడా ఉత్సవాలు కావడం విశేషం.













.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!