

భారత విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ టీ20 క్రికెట్‌లో అనవసర రికార్డు నమోదు చేశాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో టీ20 క్రికెట్‌లో 10 సార్లు డకౌట్ అయిన తొలి ఆటగాడిగా నిలిచాడు. జపాన్‌తో జరిగిన చారిత్రక టీ20 మ్యాచ్‌లో తొలి బంతికే ఔటై గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరడంతో ఈ రికార్డు అతని ఖాతాలో చేరింది. అంతకుముందు అఫ్గానిస్థాన్ స్టార్ రషీద్ ఖాన్ 2019లో 9 డకౌట్లతో ఈ జాబితాలో ముందుండగా, పాకిస్థాన్ ఆటగాడు షాదాబ్ ఖాన్ 2024లో 9 డకౌట్లు నమోదు చేశాడు.
టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లోనూ అభిషేక్ శర్మకు ఈ ఏడాది డకౌట్లు ఇబ్బందికరంగా మారాయి. జపాన్‌తో మ్యాచ్‌లో గోల్డెన్ డక్ కావడంతో 2026లో అతని టీ20 అంతర్జాతీయ డకౌట్ల సంఖ్య ఏడుకు చేరింది. ఒక క్యాలెండర్ ఇయర్‌లో టీ20 అంతర్జాతీయాల్లో అత్యధిక డకౌట్లు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో రువాండా ఆటగాళ్లు జాప్పీ బిమన్యిమనా, ఆర్కిడ్ టుయిసెంగేతో పాటు పాకిస్థాన్ బ్యాటర్ సైమ్ ఆయూబ్ కూడా ఏడేసి డకౌట్లతో ఉన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!