

బిగ్‌బాస్ తెలుగు 10లో సీజన్ ప్రారంభంలోనే కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. గేమ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు రెడ్, బ్లూ టీమ్స్‌కు బిగ్‌బాస్ శిక్ష విధించారు. ఇందులో భాగంగా రెండు టీమ్స్ నుంచి ఒక్కొక్కరిని హై రిస్క్ జోన్‌లోకి పంపించాలని ఆదేశించారు. బ్లూ టీమ్ కెప్టెన్ ఆటో రాంప్రసాద్ తనే హై రిస్క్ జోన్‌లోకి వెళ్తానని స్వచ్ఛందంగా ముందుకొచ్చాడు. రెడ్ టీమ్ సభ్యులు చరణ్‌ను ఎంపిక చేశారు. దీంతో రాంప్రసాద్, చరణ్ ఎలిమినేషన్‌కు దగ్గరగా ఉన్నారని బిగ్‌బాస్ ప్రకటించడంతో హౌస్‌లో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు రోహిత్ నాయుడు వ్యవహారశైలి కూడా చర్చనీయాంశంగా మారింది. హై రిస్క్ జోన్‌లోకి పంపించాల్సిన వ్యక్తి విషయంలో తొలుత చరణ్ పేరును సూచించిన రోహిత్.. ఆ తర్వాత తనకు అవకాశం ఉంటే చరణ్‌ను సేవ్ చేసేవాడినంటూ భావోద్వేగానికి గురయ్యాడు. దీంతో రోహిత్ డబుల్ గేమ్ ఆడుతున్నాడంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇక కామనర్‌గా హౌస్‌లోకి వచ్చిన సింగర్ ఝాన్సీపై కూడా నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. రెడ్ టీమ్‌కు సంబంధించిన విషయాలను బ్లూ టీమ్‌లోని త్రిగుణ్‌కు ఆమె చేరవేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆమెను ‘కట్టప్ప’ అంటూ ట్రోల్ చేస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!