

బిగ్‌బాస్ ఫేమ్ భాను శ్రీ తన జీవితంలో ఎదుర్కొన్న ఓ చేదు ఆర్థిక అనుభవాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. ఓ వ్యక్తిని నమ్మి రూ.20 లక్షలు నగదు రూపంలో ఇచ్చినట్లు ఆమె తెలిపింది. మొదట దాదాపు రెండేళ్ల పాటు నెలకు 3 శాతం వడ్డీని తన బ్యాంకు ఖాతాలో క్రమం తప్పకుండా జమ చేశారని, దీంతో తనకు ఆ వ్యక్తిపై నమ్మకం మరింత పెరిగిందని చెప్పింది. అయితే రెండేళ్ల తర్వాత అసలు రూ.20 లక్షలు తిరిగి ఇవ్వాలని అడిగినప్పుడు వారు నిరాకరించారని భాను శ్రీ పేర్కొంది. డబ్బును షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టామని, అందులో మొత్తం పోయిందని చెప్పినట్లు వెల్లడించింది.
తాను నగదు రూపంలో డబ్బు ఇవ్వడంతో, దానికి సంబంధించిన ఆధారం లేదంటూ వారు ప్రశ్నించినట్లు భాను శ్రీ ఆవేదన వ్యక్తం చేసింది. ఇల్లు కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో ఈ మొత్తాన్ని సమకూర్చుకున్నానని, తన వద్ద ఉన్న పొదుపుతో పాటు తల్లికి చెందిన చిన్న భూమిని విక్రయించి డబ్బు ఇచ్చానని వివరించింది. ఈ ఘటన తనను ఆర్థికంగా, మానసికంగా తీవ్రంగా దెబ్బతీసిందని చెప్పిన భాను శ్రీ.. ఈ అనుభవం నుంచి తాను మరింత బలంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. తనను మోసం చేసిన వారికి కర్మ తప్పకుండా తిరిగి ఫలితం చూపిస్తుందని ఆమె అభిప్రాయపడింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!