
గాసిప్స్

బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పుకు రంగం సిద్ధమవుతోంది. ఇకపై ఖాతాదారులు బ్యాంకు శాఖలకు వెళ్లకుండా ఏటీఎంల నుంచే నేరుగా డెబిట్ కార్డులు పొందే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ కొత్త సదుపాయాన్ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (డీఎఫ్‌ఎస్) కార్యదర్శి ఈ సాయంత్రం ప్రారంభించనున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న డెబిట్ కార్డు జారీ విధానంలో మార్పులు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఏటీఎంల ద్వారా కార్డులను నేరుగా అందించడం వల్ల ఖాతాదారులు బ్యాంకు శాఖలను ఆశ్రయించాల్సిన అవసరం తగ్గనుంది. అలాగే పోస్టు లేదా ఇతర డెలివరీ మార్గాల ద్వారా కార్డు కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి కూడా తగ్గే అవకాశం ఉంది. కొత్త విధానం అమల్లోకి వస్తే డెబిట్ కార్డు జారీ ప్రక్రియ వేగవంతమై, బ్యాంకింగ్ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!