
గాసిప్స్

గణేష్ చతుర్థి వేడుకల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే అన్ని గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించినట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, మరింత వైభవంగా నిర్వహించుకునేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో గణేష్ ఉత్సవాల నిర్వాహకులకు విద్యుత్ ఖర్చుల విషయంలో ఉపశమనం లభించనుంది.
వినాయక చవితి సందర్భంగా ప్రజలకు మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేలా ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుందని తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!