

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 తొలి వారం టాస్క్ మరింత ఆసక్తికరంగా మారింది. రెడ్, బ్లూ టీమ్‌ల మధ్య పోటీ జరుగుతుండగానే.. తాజాగా బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ప్రతి టీమ్ నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసి హై రిస్క్‌లోకి పంపాల్సి ఉంటుందని ప్రకటించారు. బ్లూ టీమ్ నుంచి రామ్ ప్రసాద్ స్వయంగా రిస్క్‌లోకి వెళ్తానని చెప్పడంతో హౌస్‌మేట్స్ ఆశ్చర్యపోయారు. మరోవైపు రోహిత్ తన టీమ్ నుంచి చరణ్ పేరును సూచించాడు.
అయితే అసలు ట్విస్ట్ అక్కడే వచ్చింది. హై రిస్క్‌లో ఉన్నవారు ఈ వారం ఎప్పుడైనా ఎలిమినేట్ అయ్యే డేంజర్‌లో ఉంటారని బిగ్‌బాస్ ప్రకటించడంతో ఇంట్లో టెన్షన్ పెరిగింది. తాను స్వచ్ఛందంగా ఒప్పుకోలేదని, ఇతరులే తన పేరును నిర్ణయించారని చరణ్ చెప్పాడు. మరోవైపు రోహిత్ ఎట్టి పరిస్థితుల్లోనూ తనను తాను రిస్క్‌లోకి పంపించుకోడని త్రిగుణ్ వ్యాఖ్యానించాడు. అనంతరం చరణ్‌ను ఓదార్చేందుకు రోహిత్ ప్రయత్నిస్తూ.. అవకాశం ఉంటే అతని కోసం గట్టిగా పోరాడేవాడినని భావోద్వేగానికి గురయ్యాడు. దీంతో డే 3 ఎపిసోడ్‌పై ఆసక్తి మరింత పెరిగింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!