9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ 10 తెలుగు డే 2: రోహిత్ యాటిట్యూడ్‌పై వర్షిణి ఫైర్..

Writer: Chandrika 09:43 AM, 9 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్ 10 తెలుగు డే 2: రోహిత్ యాటిట్యూడ్‌పై వర్షిణి ఫైర్..

బిగ్‌బాస్ 10 తెలుగు రెండో రోజు ఆట రసవత్తరంగా సాగింది. ఇంటి సభ్యులను రెండు టీమ్‌లుగా విభజించి, ఒక్కో టీమ్‌కు నాయకులను ఎంపిక చేశారు. సెలబ్రిటీ టీమ్‌ నుంచి రాం ప్రసాద్‌ను, సామాన్యుల టీమ్‌ నుంచి రోహిత్‌ను నాయకులుగా ఎన్నుకున్నారు. అనంతరం బ్యాడ్జ్‌ల ఆధారంగా సైనికులను ఎంపిక చేసుకునే టాస్క్ నిర్వహించారు. ఈ ప్రక్రియలోనే ఇంటి సభ్యుల మధ్య ఆసక్తికరమైన చర్చలు, విభేదాలు మొదలయ్యాయి.

అయితే ఇంటి సభ్యుల చర్చలో రోహిత్‌ యాటిట్యూడ్‌పై యాంకర్ వర్షిణి తీవ్ర విమర్శలు చేసింది. అగ్నిపరీక్షలో రోహిత్ ఆటతీరును చూసి అతనిపై మంచి అభిప్రాయం ఏర్పడిందని, తనతో మంచి వైబ్ ఉంటుందని అనుకున్నానని చెప్పింది. కానీ బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన తర్వాత రోహిత్‌ ప్రవర్తనలో మార్పు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. తానే అందరికంటే గొప్ప అన్నట్టుగా, తనకు సాటి ఎవరూ లేరన్నట్టుగా అతను వ్యవహరిస్తున్నాడని విమర్శించింది. ఒక టాస్క్‌లో ఓడిపోయినప్పటికీ తన తప్పును అంగీకరించకుండా ఎదుటివారినే నిందించాడని ఆరోపించింది.

అగ్నిపరీక్షలో రోహిత్‌కు పదేపదే ప్రశంసలు, ప్రాధాన్యత లభించడం వల్లే అతనిలో ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగి ఉండొచ్చని వర్షిణి అభిప్రాయపడింది. అగ్నిపరీక్ష నుంచి బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చేలోపే అతనిలో ఆత్మవిశ్వాసం హద్దులు దాటిందని, ఇక రియాలిటీ ఏంటో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. మరోవైపు ఇంటి సభ్యులు గ్రూపులుగా ఆడుతున్నారన్న అంశంపైనా చర్చ జరిగింది. ఆర్జే చరణ్, వర్షిణి మధ్య ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఝాన్సీ మాత్రం తటస్థంగా ఉంటూ అందరి గేమ్‌ను గమనిస్తోందని త్రిగుణ్ చెప్పాడు. ఇదిలా ఉండగా, శాలిని ప్రతి విషయాన్నీ గొడవగా మార్చుకుంటోందని, తనే గొప్ప అన్నట్టుగా వ్యవహరిస్తోందని దేబ్జానీ విమర్శించింది. దీంతో బిగ్ బాస్ హౌస్‌లో రెండో రోజుకే విభేదాలు మరింత ముదిరే సంకేతాలు కనిపించాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ తెలుగు 10 డే 3 ప్రోమో 1:హై రిస్క్ టాస్క్‌తో బిగ్‌బాస్ హౌస్‌లో హై టెన్షన్...

బిగ్‌బాస్ తెలుగు 10 డే 3 ప్రోమో 1:హై రిస్క్ టాస్క్‌తో బిగ్‌బాస్ హౌస్‌లో హై టెన్షన్...

బిగ్‌బాస్ ఫేమ్ భాను శ్రీ జీవితంలో ఊహించని మోసం..అసలేం జరిగిందంటే?

బిగ్‌బాస్ ఫేమ్ భాను శ్రీ జీవితంలో ఊహించని మోసం..అసలేం జరిగిందంటే?

‘సింపతీ స్టార్’ ట్రోలింగ్‌పై బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ఫేమ్ రాజకుమారి ఎమోషనల్...

‘సింపతీ స్టార్’ ట్రోలింగ్‌పై బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ఫేమ్ రాజకుమారి ఎమోషనల్...

బిగ్‌బాస్‌పై ఇనయా సుల్తానా సంచలన వ్యాఖ్యలు...

బిగ్‌బాస్‌పై ఇనయా సుల్తానా సంచలన వ్యాఖ్యలు...

బిగ్‌బాస్ 10: తొలిరోజు ఓటింగ్‌లో రోహిత్, ముఖేష్ టాప్‌.. డేంజర్‌లో ఆ ఇద్దరు!

బిగ్‌బాస్ 10: తొలిరోజు ఓటింగ్‌లో రోహిత్, ముఖేష్ టాప్‌.. డేంజర్‌లో ఆ ఇద్దరు!

నన్ను నామినేట్‌ చేసే ముందు ఆలోచించండి...రామ్ ప్రసాద్ వార్నింగ్

నన్ను నామినేట్‌ చేసే ముందు ఆలోచించండి...రామ్ ప్రసాద్ వార్నింగ్

ట్యాగ్లు
బిగ్ బాస్ 10 తెలుగుబిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 10రోహిత్వర్షిణిరాం ప్రసాద్దేబ్జానీఆర్జే చరణ్త్రిగుణ్అగ్నిపరీక్ష
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రజల గొడవే తన గొడవగా జీవించిన మహనీయుడు కాళోజీ: కేటీఆర్
జనరల్

ప్రజల గొడవే తన గొడవగా జీవించిన మహనీయుడు కాళోజీ: కేటీఆర్

విశాఖలో తొలి స్లమ్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన మంత్రి నారాయణ...
జనరల్

విశాఖలో తొలి స్లమ్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన మంత్రి నారాయణ...

తిరుమల డిప్యూటీ ఈవో లోకనాథం సస్పెన్షన్..
జనరల్

తిరుమల డిప్యూటీ ఈవో లోకనాథం సస్పెన్షన్..

బిగ్‌బాస్ తెలుగు 10 డే 3 ప్రోమో 1:హై రిస్క్ టాస్క్‌తో బిగ్‌బాస్ హౌస్‌లో హై టెన్షన్...
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 3 ప్రోమో 1:హై రిస్క్ టాస్క్‌తో బిగ్‌బాస్ హౌస్‌లో హై టెన్షన్...

బిగ్‌బాస్ ఫేమ్ భాను శ్రీ జీవితంలో ఊహించని మోసం..అసలేం జరిగిందంటే?
షోస్

బిగ్‌బాస్ ఫేమ్ భాను శ్రీ జీవితంలో ఊహించని మోసం..అసలేం జరిగిందంటే?

‘సింపతీ స్టార్’ ట్రోలింగ్‌పై బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ఫేమ్ రాజకుమారి ఎమోషనల్...
షోస్

‘సింపతీ స్టార్’ ట్రోలింగ్‌పై బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ఫేమ్ రాజకుమారి ఎమోషనల్...

బిగ్‌బాస్‌పై ఇనయా సుల్తానా సంచలన వ్యాఖ్యలు...
షోస్

బిగ్‌బాస్‌పై ఇనయా సుల్తానా సంచలన వ్యాఖ్యలు...

నేడు టీటీడీ బోర్డు మీటింగ్..
జనరల్

నేడు టీటీడీ బోర్డు మీటింగ్..

నేడు గవర్నర్‌ను కలవనున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు..
రాజకీయాలు

నేడు గవర్నర్‌ను కలవనున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు..

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో భారీ వృద్ధి..
బిజినెస్

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో భారీ వృద్ధి..

చైనా టిబెట్‌లో మరోసారి భూకంపం..
జనరల్

చైనా టిబెట్‌లో మరోసారి భూకంపం..

మెటా నుంచి కొత్త ‘మ్యూజ్’ ఏఐ ఏజెంట్
టెక్నాలజీ

మెటా నుంచి కొత్త ‘మ్యూజ్’ ఏఐ ఏజెంట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!