

ఈ నెల 6న ప్రారంభమైన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ప్రేక్షకుల నుంచి ప్రశంసలతో పాటు విమర్శలను కూడా అందుకుంటోంది. సెలబ్రిటీలతో పాటు కామనర్స్ కూడా పోటీపడుతుండటంతో షోపై ఆసక్తి కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు సీరియల్ నటులు హౌస్‌లో ఉండగా, ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో వసుధార పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న రక్ష గౌడ కూడా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.
ఇదిలా ఉండగా, ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో రిషి పాత్రలో నటించిన ముఖేష్ ఇప్పటికే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఆ తర్వాత సినిమాల్లోనూ అవకాశాలు అందిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. ముఖేష్‌కు వారానికి సుమారు రూ.3 లక్షల వరకు పారితోషికం అందుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆయన 100 రోజులు హౌస్‌లో కొనసాగితే భారీ మొత్తంలో సంపాదించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అయితే ఈ పారితోషికానికి సంబంధించి అధికారిక ధ్రువీకరణ లేదు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!