1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్ బాస్ తెలుగు 10లో మరోసారి గ్రూపిజం రచ్చ..

Writer: Chandrika 01:00 PM, 1 అక్టోబర్, 2026
బిగ్ బాస్ తెలుగు 10లో మరోసారి గ్రూపిజం రచ్చ..

బిగ్ బాస్ తెలుగు 10లో కెప్టెన్సీ టాస్కులు ప్రారంభమైనప్పటి నుంచి హౌస్‌లో పోటీతో పాటు వ్యక్తిగత విభేదాలు కూడా మరింత ముదిరాయి. ఇప్పటికే రెండు టీమ్స్‌గా విడిపోయిన కంటెస్టెంట్లు టాస్కుల్లో హోరాహోరీగా పోటీపడుతుండగా.. గ్రూపుల మధ్య వ్యూహాలు, వ్యక్తిగత సంబంధాలు చర్చనీయాంశంగా మారాయి. నామినేషన్స్ ప్రక్రియ పూర్తవడంతో ఎలిమినేషన్ బరిలో ఉన్న కంటెస్టెంట్లు ప్రేక్షకుల మద్దతు కోరుతున్నారు. తొలిసారి నామినేషన్‌లోకి వచ్చిన నరేష్ కెమెరా ముందుకు వచ్చి తనకు ఓట్లు వేసి సేవ్ చేయాలని ప్రేక్షకులను కోరాడు. మరోవైపు రోహిత్ తన ‘అగ్నిపరీక్ష’ బ్యాచ్ సభ్యులతో మాట్లాడుతూ దేబ్జానీపై తన అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటు అపూర్వను కూడా తమ గ్రూప్‌లోకి తీసుకురావడానికి ప్రయత్నించినట్లు కనిపించింది.

ఇదిలా ఉండగా.. కత్తుల టాస్క్ హౌస్‌లో మరోసారి వివాదానికి దారితీసింది. ఝాన్సీ తన దగ్గర ఉన్న కత్తులను మష్రూమ్ రూమ్‌లో దాచుకోవడంతో షాలినితో వాగ్వాదం జరిగింది. ఈ విషయంపై ముకేశ్, త్రిగుణ్ కూడా ఝాన్సీతో చర్చకు దిగారు. రెండు కంటే ఎక్కువ కత్తులు ఎవరి వద్ద ఉంటే ఆరో వారంలో ఇమ్యూనిటీ లభిస్తుందని బిగ్ బాస్ ప్రకటించడంతో కంటెస్టెంట్లు కత్తుల కోసం పోటీపడ్డారు. త్రిగుణ్ దగ్గరకు ఓ కత్తి చేరడంతో అమన్‌తో అతడికి తీవ్ర వాగ్వాదం జరిగింది. అమన్ త్రిగుణ్ మణికట్టును పట్టుకోవడం, త్రిగుణ్ అతడిని తోసేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సమయంలో రోహిత్ తన గ్రూప్ సభ్యులకు మద్దతుగా జోక్యం చేసుకున్నాడు. అనంతరం కెప్టెన్సీ కోసం ‘ఫైర్ అండ్ లావా’ టాస్క్ నిర్వహించారు. భైరవ రెడ్ టీమ్ తరఫున వంశీ, రామ్ ప్రసాద్, అమన్, రోహిత్.. సప్తశక్తి బ్లూ టీమ్ తరఫున త్రిగుణ్, ముకేశ్, దేబ్జానీ, సృష్టి పోటీపడ్డారు. నిర్దేశించిన మార్గంలో డ్రమ్స్‌ను తీసుకెళ్లి రంధ్రాలు ఉన్న బోర్డులో ఉంచే ఈ టాస్క్‌లో భైరవ రెడ్ టీమ్ విజయం సాధించింది. అయితే టాస్క్ తర్వాత కూడా గ్రూపిజంపై చర్చ కొనసాగింది. రోహిత్ షాలినికి మద్దతు ఇవ్వడంతో ఇద్దరి మధ్యే మరోసారి వాగ్వాదం చోటుచేసుకుంది. తనకు మద్దతు ఇస్తున్నట్లు బయట చూపించుకోవద్దని షాలిని చెప్పగా.. తన టీమ్ కంటే బయటివారికి మద్దతు ఇస్తున్నానని విమర్శలు రావడంతో రోహిత్ స్పందించాడు. దీంతో హౌస్‌లో గ్రూపులు, స్నేహాలు, వ్యక్తిగత సమీకరణాలపై మరోసారి చర్చ మొదలైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ తెలుగు 10: రెండు రోజులకే రూ.15 లక్షలతో ఎందుకు బయటికి వచ్చాడో చెప్పిన మిథిలేష్

బిగ్ బాస్ తెలుగు 10: రెండు రోజులకే రూ.15 లక్షలతో ఎందుకు బయటికి వచ్చాడో చెప్పిన మిథిలేష్

బిగ్ బాస్ తెలుగు 10: ‘ఉమెన్ కార్డ్’ వాడుతున్నారంటూ లేడీ కంటెస్టెంట్లపై ట్రోలింగ్

బిగ్ బాస్ తెలుగు 10: ‘ఉమెన్ కార్డ్’ వాడుతున్నారంటూ లేడీ కంటెస్టెంట్లపై ట్రోలింగ్

నేనూ మనిషినే.. ఆ కామెంట్లు చాలా బాధపెట్టాయి - ఆర్జే కాజల్

నేనూ మనిషినే.. ఆ కామెంట్లు చాలా బాధపెట్టాయి - ఆర్జే కాజల్

డెమాన్ పవన్‌ పోస్ట్‌పై రీతూ రియాక్షన్...

డెమాన్ పవన్‌ పోస్ట్‌పై రీతూ రియాక్షన్...

బిగ్ బాస్ తెలుగు 10 డే 24 :కెప్టెన్సీ టాస్క్‌లో గొడవలు, ఎమోషన్స్

బిగ్ బాస్ తెలుగు 10 డే 24 :కెప్టెన్సీ టాస్క్‌లో గొడవలు, ఎమోషన్స్

22 ఏళ్ల ‘కాఫీ విత్ కరణ్‌’ జర్నీకి ఎండ్‌కార్డ్‌..

22 ఏళ్ల ‘కాఫీ విత్ కరణ్‌’ జర్నీకి ఎండ్‌కార్డ్‌..

ట్యాగ్లు
బిగ్ బాస్ తెలుగు 10బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 10రోహిత్షాలినిత్రిగుణ్అమన్బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ఫైర్ అండ్ లావా టాస్క్బిగ్ బాస్ గ్రూపిజం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ జోరు..
బిజినెస్

జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ జోరు..

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న ఏపీ ప్రభుత్వం...
జనరల్

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న ఏపీ ప్రభుత్వం...

ప్రతి శనివారం బ్యాంకులకు సెలవా? వైరల్‌ నోటిఫికేషన్‌పై కేంద్రం క్లారిటీ
జనరల్

ప్రతి శనివారం బ్యాంకులకు సెలవా? వైరల్‌ నోటిఫికేషన్‌పై కేంద్రం క్లారిటీ

బెర్లిన్‌లో తెలంగాణ లేజిస్లేచర్‌ ప్రతినిధులకు ఘన స్వాగతం
జనరల్

బెర్లిన్‌లో తెలంగాణ లేజిస్లేచర్‌ ప్రతినిధులకు ఘన స్వాగతం

‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత నాగవంశీ
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత నాగవంశీ

అమెరికా-ఇరాన్ అణు చర్చల్లో కీలక పరిణామం..
జనరల్

అమెరికా-ఇరాన్ అణు చర్చల్లో కీలక పరిణామం..

స్టాక్‌ మార్కెట్‌లో భారీ పతనం..
బిజినెస్

స్టాక్‌ మార్కెట్‌లో భారీ పతనం..

నీర్జా భనోట్: ప్రయాణికుల ప్రాణాల కోసం ప్రాణత్యాగం చేసిన భారత వీరనారి
జనరల్

నీర్జా భనోట్: ప్రయాణికుల ప్రాణాల కోసం ప్రాణత్యాగం చేసిన భారత వీరనారి

ఎర్రవల్లి భూసర్వే నివేదిక సిద్ధం.. ప్రభుత్వానికి అందజేయనున్న కలెక్టర్
జనరల్

ఎర్రవల్లి భూసర్వే నివేదిక సిద్ధం.. ప్రభుత్వానికి అందజేయనున్న కలెక్టర్

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై హైకోర్టులో విజయారెడ్డి పిటిషన్..
రాజకీయాలు

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై హైకోర్టులో విజయారెడ్డి పిటిషన్..

రేపల్లె పెన్షన్ల పంపిణీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
జనరల్

రేపల్లె పెన్షన్ల పంపిణీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

తొలగించిన ఓట్లను పునరుద్ధరించకపోతే నగరం తగలబడుతుంది – దానం నాగేందర్
రాజకీయాలు

తొలగించిన ఓట్లను పునరుద్ధరించకపోతే నగరం తగలబడుతుంది – దానం నాగేందర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!