

నగర పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలను గుర్తిస్తూ టీజీ సేఫ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. శనివారం మొత్తం 22 హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టగా.. పలు చోట్ల అపరిశుభ్ర వాతావరణం ఉన్నట్లు గుర్తించారు. వంటగదుల్లో బొద్దింకలు, ఈగలు, ఎలుకల వ్యర్థాలు కనిపించాయి. ఫ్రిజ్‌లలో మాంసాహారం, శాకాహార పదార్థాలను కలిపి నిల్వ చేయడంతో పాటు మిగిలిపోయిన ఆహారాన్ని తిరిగి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వాడిన వంట నూనెను మళ్లీ వినియోగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
తనిఖీల్లో కుళ్లిన కూరగాయలు, ఫంగస్ పట్టిన ఆహార పదార్థాలు, గడువు ముగిసిన వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 544 కిలోల కుళ్లిన కూరగాయలు, కలుషిత ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు. తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన 8 హోటళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మరో 14 హోటళ్లు, రెస్టారెంట్ల లైసెన్సులను సస్పెండ్ చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!