

కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి నవంబర్ 1న దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న భారీ ర్యాలీకి దిల్లీ పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే సభ నిర్వహణకు పలు నిబంధనలు విధించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోగా కార్యక్రమాన్ని ముగించాలని, రాత్రి వేళల్లో మైదానంలో ఎవరూ ఉండకూడదని స్పష్టం చేశారు. సీసీటీవీ కెమెరాలు, తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు. దిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ శనివారం రామ్‌లీలా మైదానాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
మరోవైపు, ఆదివారం రామ్‌లీలా మైదానం మీదుగా ప్రయాణించేవారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు. ర్యాలీ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 4,000 మందికి పైగా పోలీసు సిబ్బందితో పాటు కేంద్ర బలగాలను మోహరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి హాజరయ్యే కార్యకర్తల రవాణా, బస్సుల పార్కింగ్, ఇతర వసతుల ఏర్పాట్లపై ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, వేం నరేందర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులు సమీక్షించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!