

నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రామాయణం’లో రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాలో ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘జనస్థాన యువరాణి శూర్పణఖ’ అంటూ పరిచయం చేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రకుల్.. శూర్పణఖ పాత్ర గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ పాత్రలో నటించడం తనకు సరికొత్త అనుభూతినిచ్చిందని తెలిపారు.
రామాయణంలో యుద్ధానికి దారితీసిన పరిణామాల్లో శూర్పణఖ పాత్ర కీలకమని, అయితే ఆమె గురించి చాలామందికి పూర్తిస్థాయిలో తెలియదని రకుల్ పేర్కొన్నారు. ఈ సినిమాలో శూర్పణఖను ఇప్పటివరకు చూడని కొత్త కోణంలో చూపించబోతున్నారని చెప్పారు. తరతరాలుగా ప్రజల మనసుల్లో నిలిచిపోయిన గొప్ప ఇతిహాసంలో భాగం కావడం తన అదృష్టమని అన్నారు. తన పాత్రను ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!