

మాస్ పోయెట్రీతో కూడిన మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘చకోర – లూనార్ లవ్ బర్డ్’. శ్రవణ్, మలైకా టి. వాసుపల్‌ను సరికొత్త ప్రేమజంటగా పరిచయం చేస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా రెండో ఎనర్జిటిక్ సాంగ్ ‘ధమ్ ధమ్’ లిరికల్ వీడియోను ప్రముఖ సంగీత దర్శకుడు జీ.వీ. ప్రకాశ్ కుమార్ ఆవిష్కరించారు. హై జాయ్ కమర్షియల్ బ్యానర్‌పై డా. చింతాడ హేమారావు నిర్మాతగా, వీఐపీ (వింటేజ్ ఐకానిక్ పిక్చర్స్) నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. పూరి జగన్నాథ్ వద్ద ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన మంగా శ్రీనివాస్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఈ చిత్రానికి ప్రిన్స్ హెన్రీ సంగీతం అందిస్తున్నారు. ‘ధమ్ ధమ్’ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, మెహర్ బాబా కొరియోగ్రఫీ చేశారు. నూతన గాయని అభిఖ్య తనికెళ్ల ఈ ఎనర్జిటిక్ సాంగ్‌ను ఆలపించారు. ఈ పాట యువతను ఉర్రూతలూగించేలా ఉంటుందని జీ.వీ. ప్రకాశ్ కుమార్ ప్రశంసించారు. ‘చకోర’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 8న థియేటర్లలో విడుదల కానుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!