

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో పన్నెండో వారం ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే టెంపర్ వంశీ ఎలిమినేట్ కాగా, ఆదివారం ఎపిసోడ్‌లో మరో కంటెస్టెంట్ ఇంటి నుంచి బయటకు వెళ్లనున్నాడు. ఈ నేపథ్యంలో తాజా ప్రోమోలో నాగార్జున ఇంటి సభ్యులకు సరదా టాస్క్ నిర్వహించారు. ఒకవైపు సినిమాల పేర్లు, మరోవైపు వాటికి సంబంధించిన వస్తువుల చిత్రాలను ఉంచి సరైన జోడీలను గుర్తించాలని సూచించారు. ఈ టాస్క్‌లో వర్షిణి, దేబ్జానీ రెండు జట్లుగా పోటీపడ్డారు. పాట ఆగినప్పుడు ముందుగా గంట మోగించిన వారికి సమాధానం చెప్పే అవకాశం కల్పించారు.
మొదట రాం ప్రసాద్, నరేశ్ పోటీపడగా, ఇద్దరూ పోల్స్ పట్టుకుని తిరిగే క్రమంలో ఆసక్తికరమైన సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. అనంతరం నరేశ్ ‘పెద్ది’ సినిమాకు బ్యాట్‌ను జత చేయగా, శివ్ ‘శంకర్ దాదా’ సినిమాకు స్టెతస్కోప్‌ను సరైన జోడీగా గుర్తించాడు. చివరగా దేబ్జానీ, వర్షిణి పోటీలోకి దిగారు. ‘మన్మథుడు’ సినిమాకు సంబంధించిన వస్తువును గుర్తించడంలో దేబ్జానీ తడబడటంతో రాం ప్రసాద్ ఆమెను ప్రశ్నలతో ఇబ్బందిపెట్టాడు. చివరకు ‘మన్మథుడు ఎవర్‌గ్రీన్’ అంటూ నాగార్జునను ఉద్దేశించి సమాధానాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఈ సరదా సంభాషణ ప్రోమోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!