
రాజకీయాలు

వైసీపీపై జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ చనిపోయిన పార్టీ అని, తమకు రాజకీయంగా పోటీ ఇచ్చే పరిస్థితిలో కూడా లేదని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అత్యధిక మెజార్టీ సాధించిందని పేర్కొన్నారు. ప్రజల మద్దతు పూర్తిగా కూటమి వైపే ఉందని ధీమా వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో మరో 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని నాగబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. కోట్లాది మంది ప్రజలు కూటమికి మద్దతుగా ఉన్నారని, వైసీపీ వెంట ఉన్నది రౌడీలు మాత్రమేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కూటమికి ప్రజాదరణ పెరుగుతోందని ఆయన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!