

బక్రీద్ సందర్భంగా లక్నోలో మాట్లాడిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మసీదులు లేదా ప్రార్థనా ప్రదేశాల్లో స్థలం సరిపోకపోతే నమాజ్‌ను షిఫ్ట్‌లలో నిర్వహించాలని సూచించారు. ప్రజా రహదారులు రాకపోకల కోసం ఉంటాయని, వాటిని మతపరమైన కార్యక్రమాల కోసం దిగ్బంధం చేయడం సరైంది కాదని అన్నారు. ప్రభుత్వం నమాజ్‌కు వ్యతిరేకం కాదని, రోడ్లపై ప్రార్థనలు నిర్వహించడానికే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఈద్ అల్ అదా సందర్భంగా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని యోగి హెచ్చరించారు. పెద్ద ఎత్తున వచ్చే భక్తులను షిఫ్ట్‌ల విధానంలో ప్రార్థనలు నిర్వహించడం ద్వారా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడవచ్చని తెలిపారు. యోగి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ప్రజా శాంతి, ట్రాఫిక్ నిర్వహణకు ఇది అవసరమని మద్దతు తెలుపుతుండగా, మరికొందరు ముస్లిం మతాచారాలను లక్ష్యంగా చేసుకున్న చర్యగా విమర్శిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!