

యశ్ హీరోగా తెరకెక్కిన టాక్సిక్ సినిమా బాక్సాఫీస్ వద్ద తొలి రోజే సుమారు రూ.104 కోట్ల వసూళ్లు సాధించినట్లు సమాచారం. అయితే ఈ చిత్రంపై తమిళనాడు నేత, ‘వీ ద లీడర్స్’ వ్యవస్థాపకుడు అన్నామలై తీవ్ర విమర్శలు చేశారు. సినిమాలో మహిళలను కించపరిచేలా చూపించారని, స్త్రీద్వేష ధోరణులు కనిపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. మహిళలను ఒక వస్తువుగా చూపించే విధానం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.
టాక్సిక్‌కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అనుమతులు ఇవ్వడంపైనా అన్నామలై అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమాల్లో ఏ సన్నివేశాలను అనుమతించాలనే విషయంలో సెన్సార్ బోర్డు మరింత కఠినంగా వ్యవహరించాలని, ప్రముఖ నటీనటులు ఉన్న చిత్రాల విషయంలోనూ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని కోరారు. మహిళలను కించపరిచే కంటెంట్‌ను చిన్నారులు పదేపదే చూస్తే వారి ఆలోచనా విధానంపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ప్రయత్నాలకు ఇలాంటి చిత్రాలు సవాలుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!