27, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విదేశీ ఉద్యోగాలకు యువతకు తెలంగాణ సర్కార్ ఆర్థిక సాయం!

Writer: Harika S 04:40 PM, 27 నవంబర్, 2026
విదేశీ ఉద్యోగాలకు యువతకు తెలంగాణ సర్కార్ ఆర్థిక సాయం!

విదేశాల్లో ఉద్యోగాలు సాధించాలనుకునే ఆర్థికంగా వెనుకబడిన నిరుద్యోగ యువతకు ఆర్థిక చేయూత అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ పథకం అమలుకు సంబంధించి నవంబర్ 19న జీవో నంబర్ 19 జారీ చేసి మార్గదర్శకాలను విడుదల చేసింది. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) ఆధ్వర్యంలో ఈ పథకం అమలు కానుంది. విదేశీ భాషలపై అవగాహన లేకపోవడం, అవసరమైన నైపుణ్యాలు లేకపోవడం, ధ్రువీకరణ పత్రాలు పొందడం, విదేశాలకు వెళ్లేందుకు అయ్యే అధిక ఖర్చులు వంటి సమస్యలను అధిగమించేందుకు టామ్‌కామ్ సహకారం అందిస్తుంది. భాషా శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, సర్టిఫికేషన్‌తో పాటు చట్టబద్ధమైన, సురక్షితమైన మార్గాల్లో విదేశీ ఉద్యోగాలు పొందేందుకు తోడ్పడుతుంది.

2026–27 ఆర్థిక సంవత్సరంలో తొలి ఏడాది 7 వేల మందికి ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వీరిలో విదేశీ భాషా శిక్షణ అవసరం లేకుండా నేరుగా ఉద్యోగాలకు వెళ్లే 5,880 మంది, భాషా ప్రావీణ్యం అవసరమైన ఉద్యోగాలకు వెళ్లే 1,120 మంది ఉంటారు. ఈ పథకాన్ని రెండు కేటగిరీలుగా విభజించారు. మొదటి కేటగిరీలో అర్హులైన అభ్యర్థులకు వీసా, విమాన ప్రయాణ ఖర్చుల్లో 50 శాతం సబ్సిడీ అందిస్తారు. గరిష్ఠంగా రూ.50 వేల వరకు ప్రభుత్వం భరిస్తుంది. రెండో కేటగిరీలో విదేశీ భాషా శిక్షణ అవసరమైన అభ్యర్థులకు అర్హమైన ఖర్చుల్లో 50 శాతం, గరిష్ఠంగా రూ.1.75 లక్షల వరకు సబ్సిడీ లభిస్తుంది. సాధారణంగా అభ్యర్థుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. తెలంగాణ స్థానికులై ఉండటంతో పాటు ప్రభుత్వం నిర్దేశించిన ఈడబ్ల్యూఎస్ ఆదాయ పరిమితికి లోబడి ఉండాలి. విద్యార్హతలు, పని అనుభవం, పాస్‌పోర్టు, వైద్య పరీక్షలకు సంబంధించిన నిబంధనలను కూడా పూర్తి చేయాలి. ఒక రేషన్ కార్డుపై ఒకరికి మాత్రమే సబ్సిడీ అందుతుంది. మొత్తం లబ్ధిదారుల్లో మహిళలకు కనీసం 33.33 శాతం, దివ్యాంగులకు కనీసం 5 శాతం కేటాయించారు.

నిర్మాణం, మౌలిక సదుపాయాలు, తయారీ పరిశ్రమలు, ఆటోమొబైల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, రవాణా, లాజిస్టిక్స్, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్, వైద్య సహాయక సేవలు, హోటళ్లు, పర్యాటకం, మరమ్మతులు, నిర్వహణ, గృహ సేవలు వంటి పది రంగాలకు ఈ పథకం వర్తిస్తుంది. టామ్‌కామ్ ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్, రేషన్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్టు, విద్యార్హతలు, పని అనుభవం తదితర పత్రాలను సమర్పించాలి. కలెక్టర్ల ఆధ్వర్యంలోని జిల్లాస్థాయి కమిటీలు దరఖాస్తులను పరిశీలించి అర్హులను రాష్ట్రస్థాయి కమిటీకి సిఫారసు చేస్తాయి. దరఖాస్తుల గడువు ముగిసిన లేదా రిజిస్ట్రేషన్ పూర్తయిన 30 రోజుల్లో ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. అర్హతలను, ఖర్చులకు సంబంధించిన రసీదులను పరిశీలించిన తర్వాత సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ప్రతి అర్హమైన ఖర్చుకు ఒక్కసారి మాత్రమే సబ్సిడీ లభిస్తుంది. తప్పుడు సమాచారం లేదా నకిలీ పత్రాలు సమర్పిస్తే లబ్ధిదారుల ఎంపికను రద్దు చేయడంతో పాటు ఇప్పటికే చెల్లించిన సబ్సిడీని తిరిగి వసూలు చేస్తారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డీలిమిటేషన్‌కు కొత్త ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం

డీలిమిటేషన్‌కు కొత్త ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం

ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 63.44 శాతం పోలింగ్

ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 63.44 శాతం పోలింగ్

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జగన్‌కు కాల్వ శ్రీనివాసులు ఘాటు కౌంటర్

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జగన్‌కు కాల్వ శ్రీనివాసులు ఘాటు కౌంటర్

కుటుంబం కోసం దేశాన్ని విడిచిపెట్టేందుకూ సిద్ధం: ఆజం ఖాన్

కుటుంబం కోసం దేశాన్ని విడిచిపెట్టేందుకూ సిద్ధం: ఆజం ఖాన్

యోగి ఆదిత్యనాథ్‌పై సంజయ్ రౌత్ ప్రశంసలు

యోగి ఆదిత్యనాథ్‌పై సంజయ్ రౌత్ ప్రశంసలు

రుషికొండ ప్యాలెస్‌పై కేబినెట్ కీలక చర్చ.. PPP విధానంలో అభివృద్ధికి ప్రణాళిక!

రుషికొండ ప్యాలెస్‌పై కేబినెట్ కీలక చర్చ.. PPP విధానంలో అభివృద్ధికి ప్రణాళిక!

ట్యాగ్లు
తెలంగాణ ప్రభుత్వంముఖ్యమంత్రి ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ స్కీమ్విదేశీ ఉద్యోగాలుటామ్‌కామ్ఉపాధి పథకంనిరుద్యోగ యువతనైపుణ్యాభివృద్ధి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చిన్నారులకు అనుచిత సందేశాలు.. ‘టాకీ’ ఏఐ యాప్‌ను తొలగించిన యాపిల్‌
టెక్నాలజీ

చిన్నారులకు అనుచిత సందేశాలు.. ‘టాకీ’ ఏఐ యాప్‌ను తొలగించిన యాపిల్‌

డీలిమిటేషన్‌కు కొత్త ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం
రాజకీయాలు

డీలిమిటేషన్‌కు కొత్త ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం

ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 63.44 శాతం పోలింగ్
రాజకీయాలు

ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 63.44 శాతం పోలింగ్

టీనేజర్ల భద్రత కోసం Xలో కొత్త ఫీచర్..
టెక్నాలజీ

టీనేజర్ల భద్రత కోసం Xలో కొత్త ఫీచర్..

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జగన్‌కు కాల్వ శ్రీనివాసులు ఘాటు కౌంటర్
రాజకీయాలు

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జగన్‌కు కాల్వ శ్రీనివాసులు ఘాటు కౌంటర్

వైభవ్‌ను 2027 వన్డే ప్రపంచకప్‌ జట్టులోకి తీసుకోండి- క్రిష్ణమాచారి శ్రీకాంత్
క్రీడలు

వైభవ్‌ను 2027 వన్డే ప్రపంచకప్‌ జట్టులోకి తీసుకోండి- క్రిష్ణమాచారి శ్రీకాంత్

విదేశీ ఉద్యోగాలకు యువతకు తెలంగాణ సర్కార్ ఆర్థిక సాయం!
రాజకీయాలు

విదేశీ ఉద్యోగాలకు యువతకు తెలంగాణ సర్కార్ ఆర్థిక సాయం!

నటనపై ఆసక్తి ఉందా? రామ్ చరణ్ సినిమాలో అవకాశం పొందండి
సినిమాలు

నటనపై ఆసక్తి ఉందా? రామ్ చరణ్ సినిమాలో అవకాశం పొందండి

ట్రంప్ అల్లుడిపై అవినీతి ఆరోపణలు చేసిన మాజీ మద్దతుదారు టక్కర్ కార్ల్‌సన్
జనరల్

ట్రంప్ అల్లుడిపై అవినీతి ఆరోపణలు చేసిన మాజీ మద్దతుదారు టక్కర్ కార్ల్‌సన్

కుటుంబం కోసం దేశాన్ని విడిచిపెట్టేందుకూ సిద్ధం: ఆజం ఖాన్
రాజకీయాలు

కుటుంబం కోసం దేశాన్ని విడిచిపెట్టేందుకూ సిద్ధం: ఆజం ఖాన్

చట్టసభల్లో బీసీలకు 27 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి: ఈటల రాజేందర్
జనరల్

చట్టసభల్లో బీసీలకు 27 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి: ఈటల రాజేందర్

యోగి ఆదిత్యనాథ్‌పై సంజయ్ రౌత్ ప్రశంసలు
రాజకీయాలు

యోగి ఆదిత్యనాథ్‌పై సంజయ్ రౌత్ ప్రశంసలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!