
జనరల్

తమిళనాడు సీఎంఓ అధికారిక ‘X’ (మునుపటి ట్విట్టర్) ఖాతాలో వచ్చిన ఒక పోస్టు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద వివాదానికి దారి తీసింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జోసెఫ్ విజయ్ పేరును తమిళం నుంచి ఇంగ్లీష్‌కు అనువదించే సమయంలో పొరపాటున మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్ పేరుగా చూపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటన సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతూ రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది.

ఈ పరిణామంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ, సీఎంఓ అధికారిక ఖాతా హ్యాక్ అయిందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారిక సమాచారంలో ఇలాంటి తప్పులు ఎలా జరుగుతున్నాయోనని ప్రశ్నిస్తున్నారు. ఈ ట్రాన్స్లేషన్ లోపం ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితిని తీసుకురాగా, రాష్ట్ర రాజకీయాల్లో చర్చను మరింత వేడెక్కించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!