

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో ‘వీబీ జీ రామ్ జీ’ పేరుతో తీసుకువచ్చిన బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ప్రతిపక్ష ఎంపీల ఆందోళనలు, నిరసనల మధ్య ఈ బిల్లును ఆమోదించారు. లోక్సభలో బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు.
అణు ఇంధన రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఆహ్వానించేందుకు ఉద్దేశించిన శాంతి బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. సస్టెయినబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా(శాంతి) బిల్లును మూజువాణి ఓటుతో రాజ్యసభ ఆమోదించింది.
భీమా రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని 100 శాతానికి పెంచే బీమా సవరణ బిల్లు (సబ్ కా బీమా సబ్ కా రక్ష)ను ప్రతిపక్షాల నిరసనల మధ్యే లోక్సభ ఆమోదించింది. మణిపూర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(రెండవ సవరణ)బిల్లు 2025 కి లోక్ సభ ఆమోదం తెలిపింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!