
బిజినెస్

తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను నాలుగైదు రోజుల్లో ప్రకటిస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు తెలిపారు. ఈ స్థానాల నుంచి పోటీ చేయాలనే ఆసక్తి ఉన్న నేతల పేర్లను పార్టీ అధిష్ఠానానికి పంపించినట్లు వెల్లడించారు. అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం పార్టీ అధిష్ఠానమే తీసుకుంటుందని స్పష్టం చేశారు.
తాను కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై పార్టీదే తుది నిర్ణయమని రాంచందర్‌రావు పేర్కొన్నారు. ఆశావహుల పేర్లను పరిశీలించిన అనంతరం అధిష్ఠానం అభ్యర్థులను ఖరారు చేస్తుందని తెలిపారు. పార్టీ నిర్ణయానికి అనుగుణంగా తదుపరి కార్యాచరణ ఉంటుందని ఆయన వెల్లడించారు.





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!