
క్రీడలు

పశ్చిమ బెంగాల్లో బీజేపీ శాసనసభ పక్ష నేత ఎన్నికకు రంగం సిద్ధమైంది. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు నేడు సమావేశమై తమ శాసనసభ పక్ష నేతను ఎన్నుకోనున్నారు. ఇదే సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోల్కతాకు వెళ్లి ప్రభుత్వం ఏర్పాటు అంశంపై కీలక చర్చలు జరపనున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో కూడా ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.
ఇప్పటికే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని గవర్నర్ రద్దు చేసినట్లు సమాచారం. రేపు కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. సీఎం పదవికి సువేందు అధికారి సహా ఐదుగురు నేతలు పోటీలో ఉన్నట్లు తెలుస్తుండగా, అధిష్ఠానం ఎవరికి అవకాశం ఇస్తుందన్న అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!