

విశాల్ తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితిపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం నెలకొన్న పరిస్థితులపై స్పందించిన విశాల్.. ద్రావిడ మున్నేట్ర కళగం మరియు అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత వస్తుందని అభిప్రాయపడ్డారు. తమిళగ వెట్రి కళగం కాకుండా ప్రత్యర్థి పార్టీలు చేతులు కలపడం ప్రజలు అంగీకరించరని, అలాంటి పరిస్థితులు విపత్కరంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఇక ఈ అంశంపై ఖుష్బూ సుందర్ కూడా స్పందించారు. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పుడు వాళ్లు ఎన్నుకున్న వారే రాష్ట్రాన్ని పాలించాలని ఆమె అభిప్రాయపడ్డారు. మరోవైపు తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు అంశం ఇంకా తేలలేదు. మ్యాజిక్ ఫిగర్ అయిన 118 స్థానాలు ఏ పార్టీకి రాకపోవడంతో అత్యధిక స్థానాలు గెలుచుకున్న టీవీకే అధినేత విజయ్ ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!