
క్రీడలు

కరూర్‌లో జరిగిన విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను హీరో–రాజకీయ నాయకుడు విజయ్ ఈరోజు వ్యక్తిగతంగా కలవనున్నారు. మహాబలిపురంలో ఈ సమావేశం జరగనుంది. గత నెల సెప్టెంబర్ 27న తమిళగ వెట్రి కజగం (TVK) సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించగా, 60 మందికి పైగా గాయపడ్డారు.విజయ్ పార్టీ TVK ఈ సమావేశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. బాధిత కుటుంబాలు సౌకర్యంగా ఉండేందుకు 50 గదులు బుక్ చేశారు. విజయ్ స్వయంగా వారిని కలసి సానుభూతి తెలియజేస్తూ, పార్టీ తరపున సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇవ్వనున్నారు.
ఈ చర్య విజయ్ తన అభిమానులతో ఉన్న భావోద్వేగ బంధాన్ని, మానవతా దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!