

తమిళనాడులో మదురాంతకం, ధారాపురం అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అక్టోబర్ 6న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ ఎన్నికల ప్రచారంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. బూత్ స్థాయికి ప్రచారాన్ని తీసుకెళ్లే దిశగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మదురాంతకంలో పార్టీ బూత్ స్థాయి నేతలతో సమావేశమై క్షేత్రస్థాయి ప్రచారం, ఓటర్లను కలిసే విధానం, స్థానిక సమస్యలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ రెండు స్థానాలు ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాలు కాగా, అక్టోబర్ 6న పోలింగ్, అక్టోబర్ 9న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఈ రెండు స్థానాలు గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే గెలుచుకున్నవి. ఆ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిచిన కే. మరగతం కుమారవేల్, పి. సత్యబామ రాజీనామా చేసి టీవీకేలో చేరడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ప్రస్తుతం టీవీకే తరఫున మదురాంతకంలో మరగతం కుమారవేల్, ధారాపురంలో సత్యబామ పోటీ చేస్తున్నారు. డీఎంకే తరఫున మదురాంతకంలో ఐ. పరంధామన్, ధారాపురంలో ఎస్. సుగన్య బరిలో ఉన్నారు. అన్నాడీఎంకే మదురాంతకంలో ఎస్. కనితా సంపత్, ధారాపురంలో కే. బానుమతిని అభ్యర్థులుగా నిలబెట్టింది. దీంతో మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ నెలకొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!