

నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వసతిగృహాలు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త ప్రకటించారు. రాష్ట్ర సచివాలయంలో సంక్షేమ శాఖలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో విద్యార్థులకు అందిస్తున్న డైట్ ఛార్జీలను 10 శాతం పెంచాలని అధికారులకు ఆదేశించారు. ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని అధికారులు సూచించినప్పటికీ, ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నుంచే పెంపును అమలు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల విద్యార్థుల జీవితాల్లో విద్యే మార్పుకు ప్రధాన సాధనమని అన్నారు. మెరుగైన విద్యతో పాటు పౌష్టికాహారం కూడా సమానంగా అవసరమని పేర్కొంటూ, విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని డైట్ ఛార్జీలను పెంచుతున్నామని తెలిపారు. బలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!