

బీరకాయ–దోసకాయ పచ్చడి తయారీకి ఒక పెద్ద బీరకాయ, ఒక పెద్ద దోసకాయ, 100 గ్రాముల పచ్చిమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, కొద్దిగా కొత్తిమీర తీసుకోవాలి. తాలింపు కోసం నూనె, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ సిద్ధంగా ఉంచాలి.
ముందుగా పాన్‌లో నూనె వేసి జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి వేయించాలి. తర్వాత బీరకాయ ముక్కలు వేసి మెత్తబడే వరకు వేపాలి. ఆపై దోసకాయ ముక్కలు, పసుపు వేసి కొద్దిసేపు ఉడికించాలి. చింతపండును నానబెట్టి గుజ్జు తీసుకోవాలి. మిశ్రమం చల్లారిన తర్వాత ఉప్పు, చింతపండు రసం వేసి రుబ్బాలి. చివరగా తాలింపు పోసి బాగా కలిపి వడ్డించాలి.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటించండి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!