

న్యూయార్క్ / వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వం మరో 20 దేశాలపై ప్రయాణ నిషేధాలు, ఆంక్షలు విధించింది. ఈ జాబితాలో కొన్ని దేశాలపై పూర్తి నిషేధం, మరికొన్నింటిపై పాక్షిక ఆంక్షలు అమలు చేయనుంది. అంతేకాకుండా పాలస్తీనా అథారిటీపై కూడా పూర్తిస్థాయి ఆంక్షలు విధించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులపై సంతకం చేశారు. సంబంధిత దేశాల పౌరులపై సరైన వెట్టింగ్ చేయడం కష్టంగా మారిందని, వారి గురించి నమ్మదగిన సమాచారం అందుబాటులో లేదని, అలాగే భద్రతా ముప్పును అంచనా వేసేందుకు అవసరమైన సహకారం ఆయా ప్రభుత్వాల నుంచి లభించడం లేదని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది.
అంగోలా, ఆంటిగ్వా అండ్ బార్బుడా, బెనిన్, కోట్ డెల్వాయిర్, డొమినికా, గబోన్, గాంబియా, మలావీ, మారిటానియా, నైజీరియా, సెనెగల్, టాంజానియా, టోంగా, జాంబియా, జింబాబ్వే.
బుర్కినా ఫాసో, మాలి, నైగర్, దక్షిణ సుడాన్, సిరియా.
అలాగే పాలస్తీనా అథారిటీ జారీ చేసిన పత్రాలు కలిగిన వారిపైనా పూర్తి నిషేధం అమల్లోకి వస్తుందని అమెరికా ప్రభుత్వం తెలిపింది. వెస్ట్‌బ్యాంక్, గాజా ప్రాంతాల నుంచి పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు అమెరికా పౌరులపై దాడులు చేస్తున్నాయని పేర్కొంది.
గతంలో పాక్షిక ఆంక్షలున్న లావోస్, సియర్రా లియోన్ దేశాలపై ఇప్పుడు పూర్తి నిషేధం విధించారు. అలాగే బురుండీ, క్యూబా, టోగో, వెనిజువెలా దేశాలపై పాక్షిక ఆంక్షలు కొనసాగుతాయి.
ఈ ఏడాది జూన్‌లో ట్రంప్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, చాద్, కాంగో, ఈక్వెటోరియల్ గినీ, ఎరిత్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సుడాన్, యెమెన్ సహా 12 దేశాలపై ఇప్పటికే ప్రయాణ నిషేధాలు విధించింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!