
షోస్

కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో ఏకంగా రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఆదివారం పుణెలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన.. కాంగ్రెస్ నేతృత్వంలోని గత ప్రభుత్వ పాలనను, ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనతో పోల్చారు. మోదీ పాలనలో నాలుగు అణాల విలువైన అవినీతి ఆరోపణ కూడా రాలేదని వ్యాఖ్యానించారు.
వరుసగా మూడు లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చెందడంతో కాంగ్రెస్ తీవ్ర అసహనానికి గురవుతోందని అమిత్ షా విమర్శించారు. ఆ పార్టీ నేతల వ్యాఖ్యలు, ప్రభుత్వంపై చేస్తున్న విమర్శల్లో ఈ అసహనం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. అమిత్ షా తాజా వ్యాఖ్యలతో BJP, కాంగ్రెస్ మధ్య అవినీతి, పాలన, రాజకీయ జవాబుదారీతనంపై మరోసారి మాటల యుద్ధం మొదలైంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!