
జనరల్

ఉదయనిధి స్టాలిన్ మరోసారి సనాతనం, తమిళ భాష అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలను విభజించే సనాతన విధానాలను నిర్మూలించాలని ఆయన పేర్కొన్నారు. అలాగే తమిళనాడులో అన్ని చోట్లా తమిళ భాషకు ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమంలో వందేమాతరం, జనగణమన తర్వాత తమిళ గీతం పాడడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తమిళ రాష్ట్ర గీతానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, అధికారిక కార్యక్రమాల్లో అది మొదటి స్థానంలో ఉండాలని ఉదయనిధి అన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!