
గాసిప్స్

సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని తమిళనాడు డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) గతంలో అనేక సార్లు పేర్కొన్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం సీఎం విజయ్ బలపరీక్ష సమయంలో కూడా ఆయన మాట్లాడుతూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అయితే దానిపై గురువారం ఉదయనిధి స్టాలిన్ క్లారిటీ ఇచ్చారు.
సనాతన విధానాలను నిర్మూలించడం అంటే.. ప్రజలు గుడికి వెళ్లకూడదని కాదు అని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఇవ్వాలని, ఆలయాల్లోనే కాదు, యావత్ సమాజంలో సమానత్వం పాటించాలన్నారు. అసెంబ్లీలో మాట్లాడిన తన ప్రసంగంపై వస్తున్న విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ప్రజలను విభజిస్తున్న సనాతన ధర్మాన్ని నాశనం చేయాలన్నది తన ఉద్దేశమన్నారు. అయితే తనపై వస్తున్న విమర్శలకు తలొగ్గేది లేదన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!