

తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారంపై టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏఐ (AI) సాంకేతికతను ఉపయోగించి సృష్టించిన నకిలీ డీప్‌ఫేక్ వీడియోల ద్వారా కొందరు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "నన్ను అప్రతిష్ట పాలు చేయడంతో పాటు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చడమే లక్ష్యంగా ఈ కుట్ర జరుగుతోంది" అని పేర్కొన్నారు.
ఈ తప్పుడు ప్రచారం వెనుక వైసీపీకి చెందిన కొందరి రాజకీయ దురుద్దేశం ఉందని ఆయన ఆరోపించారు. వక్రీకరించిన కంటెంట్‌తో భక్తులను అయోమయానికి గురిచేస్తున్న దుష్ట శక్తులను చట్టపరంగా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. టీటీడీ పవిత్రతను కాపాడటమే తన ప్రాధాన్యతని, ఇటువంటి కుట్రలను దీటుగా ఎదుర్కొంటానని నాయుడు భరోసా ఇచ్చారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!