
బిజినెస్

డోనాల్డ్ ట్రంప్ నుంచి వచ్చిన బెదిరింపు వ్యాఖ్యలతో పశ్చిమాసియా ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరాన్‌కు సమీప ప్రాంతాల్లో అమెరికా తన యుద్ధ నౌకలను మోహరించడంతో, ప్రాంతీయ భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ పరిణామాలు ఇరాన్–అమెరికా సంబంధాల్లో మరోసారి ఉద్రిక్తతను తెరపైకి తీసుకొచ్చాయి.
ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ సుప్రీంలీడర్ అయతుల్లా అలీ ఖమేనీ 37 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయానికి విరామం ఇచ్చినట్లు సమాచారం. సాధారణంగా ప్రతి ఏడాది ఫిబ్రవరి 8 న ఎయిర్‌ఫోర్స్ కమాండర్లతో సమావేశమయ్యే ఖమేనీ, ఈసారి ఆ భేటీని నిర్వహించలేదని తెలుస్తోంది. ప్రస్తుత భద్రతా పరిస్థితులే ఇందుకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!