

పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరిగాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఇంధన ధరలను నియంత్రించేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని రకాల చమురు ఆంక్షలను సడలించే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్లో మాట్లాడిన అనంతరం ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. యుద్ధ పరిస్థితుల కారణంగా ముడి చమురు సరఫరా అంతరాయం కలగకుండా ఉండటానికి ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నామని చెప్పారు. పరిస్థితులు సాధారణ స్థితికి వస్తే కొన్ని దేశాల పై విధించిన ఆంక్షలను తొలగించే అవకాశముందని పేర్కొన్నారు. అయితే ఆ నిర్ణయానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించలేదు.
హర్మూజ్ జలసంధి మార్గంలో ప్రయాణించే చమురు ట్యాంకర్ల భద్రతకు అమెరికా నౌకాదళం మరియు భాగస్వామ్య దేశాలు కలిసి రక్షణ కల్పిస్తాయని ట్రంప్ తెలిపారు. సైనిక చర్యలు జరిగితే చమురు ధరలు పెరిగే అవకాశం ఉంటుందని తనకు ముందే తెలుసని, అయినప్పటికీ ఇరాన్ అణు ఆయుధాలను అభివృద్ధి చేసుకోకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని చెప్పారు.
ఇరాన్ చమురు సరఫరాను అడ్డుకునే ప్రయత్నం చేస్తే దానికి గట్టి ప్రతిస్పందన ఉంటుందని కూడా ట్రంప్ హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు ఆటంకం కలిగించే చర్యలను అమెరికా సహించదని స్పష్టం చేశారు.



_0.jpg.webp&w=3840&q=75)






.jpg&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!