

డొనాల్డ్ ట్రంప్ తిరిగి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్‌పై ఆర్థిక, దౌత్యపరమైన ఒత్తిడి పెరిగింది. 2025 సంవత్సరం మొత్తం భారత్–అమెరికా సంబంధాలు వాణిజ్య టారిఫ్‌ల వివాదాల చుట్టూనే తిరిగాయి. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదరకపోవడాన్ని కారణంగా చూపుతూ, ఆగస్టులో భారత్‌పై 50 శాతం టారిఫ్‌లు విధించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది.
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు కొనసాగించడంపై ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, మరిన్ని టారిఫ్‌లతో హెచ్చరించారు. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లతో భేటీ కావడం అమెరికాలో అసంతృప్తిని రేకెత్తించింది. అనంతరం హెచ్-1బీ వీసా ఫీజులను ఏడాదికి 1 లక్ష డాలర్ల వరకు పెంచడం భారత ఐటీ రంగానికి భారీ షాక్‌గా మారింది.
అంతేకాకుండా విదేశీ చిత్రాలపై 100 శాతం టారిఫ్‌లు విధించడం వల్ల భారత సినిమా పరిశ్రమకు నష్టం వాటిల్లగా, భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే బియ్యంపై 50 శాతం సుంకం విధించారు. డిసెంబర్లో అమెరికా రైతుల కోసం భారీ రిలీఫ్ ప్యాకేజ్ ప్రకటించిన ట్రంప్, విదేశీ దిగుమతులపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ విధానాలు అమెరికాకే ప్రతికూలంగా మారే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తూ, భవిష్యత్‌లో వాషింగ్టన్–ఢిల్లీ తీసుకునే నిర్ణయాలే రెండు దేశాల సంబంధాల దిశను నిర్ణయిస్తాయని అంటున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!